![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -893 లో... కావ్య, రాజ్ గుడికి వెళ్తారు. దేవుడి దగ్గర డిజైన్స్ పెట్టమని పంతులికి చెప్తారు. ఆ తర్వాత కావ్య కళ్ళు తిరిగిపడిపోతుంటే రాజ్ పట్టుకుంటాడు. నేను చెప్పాను కదా.. నువ్వు ముందే అబార్షన్ చేయించుకుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదని రాజ్ అంటాడు. అదంతా పంతులు విని, అలా అబార్షన్ చేయించుకోమ్మంటావ్ ఏంటి తప్పు అని అడుగుతాడు.
బిడ్డని కంటే నా భార్య బ్రతకదు అని రాజ్ చెప్పగానే పంతులు షాక్ అవుతాడు. దీనికి పరిష్కారం ఉంది.. నా కూతురికి కూడా అలాగే అయింది. ఇప్పుడు సెట్ అయింది. మీరు కేరళ వెళ్లి అక్కడ ఆయుర్వేద వైద్యం చేయించుకోండి.. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని పంతులు చెప్పగానే రాజ్ సరే అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం వెంటనే ఒక వారం పాటు టూర్ వెళ్తున్నామని చెప్పి వెళదామని రాజ్ అంటాడు. మనం నా ప్రాబ్లెమ్ గురించి వెళ్తున్నామని అసలు ఇంట్లో తెలయొద్దని కావ్య అంటుంది. మరొకవైపు రాజ్ క్లయంట్స్ ని రాహుల్ రప్పించుకొని తమతో డీల్ పెట్టుకోమని అడుగుతాడు. మీ డిజైన్స్ ఎలా ఉంటాయో తెలియదు రిస్క్ చెయ్యలేనని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎలాగైనా ఆ రాజ్ డిజైన్స్ కొట్టేయాలని మేనేజర్ తో రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత రాజ్, కావ్య ఆఫీస్ కి వెళ్లి శృతి కి డిజైన్స్ ఇచ్చి మానిఫాక్చరింగ్ యూనిట్స్ పంపించు.. ఈ డిజైన్స్ ఎవరు చూడడానికి వీల్లేదు.. సెక్యూరిటీ టైట్ చెయ్యమని శృతికి రాజ్ చెప్తాడు. మేమ్ వారం పాటు బయటకు వెళ్తున్నాం డాడీ, బాబాయ్ వస్తారని రాజ్ చెప్తాడు.
మరొక వైపు అపర్ణ, ధాన్యలక్ష్మి ఇద్దరికి వాళ్ళ భర్తలు పనులు చెప్తారు. అప్పుడే రాజ్, కావ్య ఎంట్రీ ఇచ్చి.. మీకు రేపటి నుండి ఆ బాధ ఉండదు.. మేమ్ వారం పాటు కేరళ టూర్ వెళ్తాన్నాం.. డాడీ, బాబాయ్ ఆఫీస్ కి వెళ్తారని రాజ్ చెప్తాడు. మంచి పని.. లేదంటే నా కోడళ్లకు పనులు చెప్తున్నారని ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో వారం రోజుల్లో పూర్తి ఆరోగ్యంతో నువ్వు ఇంటికి రావాలని కావ్యతో రాజ్ అంటాడు. మరొకవైపు ఈ వారం రోజుల్లో కేసు ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చెయ్యాలని అప్పు అనుకుంటుంది. ఈ వారం రోజుల్లో నేను అనుకున్నది చెయ్యాలని రాహుల్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |